మీ సోదరులకు రాఖీ కడుతున్నారా? పల్లెంలో తప్పక ఉండాల్సినవి ఇవే!
Samatha
8 august 2025
Credit: Instagram
అన్నా చెల్లెళ్ల ప్రేమకు, బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ వచ్చేస్తుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.
ఈ సంవత్సరం 2025లో ఆగస్టు 9 శని వారం రోజున హిందువులందరూ రాఖీ పౌర్ణమిని జరుపుకోనున్నారు. ఈ పండగ రోజున సోదరులకు సోదరీమణులు రాఖీ కడతారు.
సోదరీమణులు తమ సోదరులు ఆనందంగా ఉండాలని, అలాగే అన్నాదమ్ముల్లు తమకు ఎప్పుడూ రక్షగా ఉండాలని ఈ రాఖీని కడతారు.
అయితే రాఖీ కట్టే సమయంలో రాఖీ పల్లెంలో తప్పకుండా కొన్ని వస్తువులు ఉండాలని చెబుతున్నారు పండితులు, అవి ఏవో చూద్దాం.
సోదరి తమ బ్రదర్స్‌కు రాఖీ కట్టేటప్పుడు ముందుగా నొదుట తిలకం పెట్టాలంట. అందుకే తప్పకుండా రాఖీ పల్లెంలో కుంకుమ ఉండాలి. ఇది దీర్ఘయువుకు చిహ్నం అంటున్నారు పండితులు.
అలాగే రాఖీ కట్టే సమయంలో ప్లేట్‌లో తప్పక అక్షింతలు ఉండాలంట. నుదిటిపై అక్షంతలు వేయడం వలన తమ సోదరుడిని కలకాలం జీవించి ఉండు అని దీవెనెలు ఇచ్చినట్లు.
రాఖీ కట్టిన తర్వాత తప్పకుండా అన్నాదమ్ములకు హారతినివ్వాలి. దీని వలన చెడు దృష్టి నుంచి వారిని రక్షించినట్లు. అందుకే హారతి పల్లెంలో దీపం ఉండాల్సిందేనంట.
మీ బంధం, ప్రేమను తెలుపుతు వారికి స్వీట్ తినిపించాలి. ఇది చాలా శుభప్రదం. అంతేకాకుండా మీ ప్రేమను మరింత బలపరుస్తుందని చెబుతున్నారు పండితులు.