రాఖీ పౌర్ణమి.. ఏ సమయంలో రాఖీ కట్టకూడదో తెలుసా?

Samatha

7 august  2025

Credit: Instagram

అన్నా చెల్లెళ్ల ప్రేమకు ప్రతీక అయిన రక్షబంధన్ వచ్చేస్తుంది. 2025 సంవత్సరంలో ఈ పండుగను ఆగస్టు 9న ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు.

ఇక రాఖీ పౌర్ణమి అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. ఈ రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని, దేవుడిని దర్శించుకుని, సోదరీమణులు తమ సోదరుడికి  మంచి గడియలో రాఖీ కడతారు.

ఎందుకంటే, రాఖీ అనేది భద్ర సమయంలో అస్సలే కట్టకూడదని చెబుతుంటారు పండితులు. కాగా, ఈ సంవత్సరం రాఖీ పండుగకు, ఏ సమయంలో రాఖీ కట్టడం ఉత్తమమో తెలుసుకుందాం.

భద్ర కాలంలో రాఖీ కట్టకపోవడానికి కారణం ఏమిటంటే? ఈ సమయంలో శూర్పణఖ రావణునికి రాఖీ కట్టిందని పురాణాలు చెబుతుంటాయి.

భద్ర సమయంలో శూర్పణఖ తన సోదరుడు రావణాసురుడికి రాఖీ కట్టింది. అందువల్లే తన వంశం మొత్తం అంతమైందని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఈ సమయంలో రాఖీ కట్టకూడదని చెబుతుంటారు. అయితే ఈ సారి భద్రకాలం ఎప్పుడు ప్రారంభమౌతుందో ఇప్పుడు చూద్దాం.

భద్ర కాలం ఈ సారి ఆగస్టు 8 మధ్యాహ్నం 12.12 గంటలకు ప్రారంభమవుతుందంట.అలాగే  ఆగస్టు 9 మధ్యాహ్నం 1.52 గంటలకు ముగుస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ఇక ఈ సంవత్సరం (2025) లో సాయంత్రం 5.30 నిమిషాల నుంచి రాత్రి 2 గంటల వరకు రాఖీ కట్టుకోవడానికి శుభ సమయం అంటున్నారు పండితులు.