శ్రావణమాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. అంతే కాకుండా వాతావరణం తేమగా ఉంటుంది. అలాగే ఈ సీజన్‌లో కీటకాలు కూడా సంతానోత్పత్తిని ప్రారంభిస్తాయి.
అందువలన ఈ మాసంలో ఎక్కువగా కీటకాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మనకు తెలియకుండా ఏదో విధంగా చిన్న చిన్న కీటకాలు ఇంటిలోపలికి ప్రవేశిస్తాయి.
అయితే అందులో ముఖ్యంగా జెర్రీ, దాని చిన్న చిన్న పిల్లలు కూడా ఇంట్లో కొన్ని సమయాల్లో కనిపిస్తాయి. దీంతో ప్రజలు వీటిని చూసి చాలా భయపడిపోతుంటారు.
అయితే దీనిపై కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రభావం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. పండితుల ప్రకారం, జెర్రీ చూడటం, లేదా అది శరీరంపై పాకడం వలన కూడా కొన్ని శుభ, అశుభ ఫలితాలు ఉంటాయంట.
జెర్రీని రాహువుకు చిహ్నంగా భావిస్తారు. అందువలన ఇది జ్యోతిష్య శాస్త్రంతో ముడి పడి ఉంటుందంట. దీని వలన మంచి చెడు రెండూ ఉంటాయంట.
మీ జాతకంలో రాహువు బలహీనంగా ఉంటే, మీ ఇంటిలోని టాయిలెట్, ప్రధాన ద్వారం గడప వద్ద లేదా మీ ఇంటి మెట్ల పై జెర్రీలు కనిపిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
అలాగే, మీ పాదాలపై లేదా చేతులపై జెర్రీ పాకినట్లు అయితే అది అశుభ సంకేతం అంట. మీరు ఏదో తప్పు పని చేస్తున్నారనే అర్థం అంట. లేదా మీరు చేసే పనిలో అడ్డంకులు ఎదురవుతాయనే సంకేతం.
అదే విధంగా ఒక వ్యక్తి తలపై జెర్రీ ఎక్కినట్లు అయితే అది తీవ్రమైన వ్యాధి లేదా అనారోగ్య సమస్యలకు సంకేతం అంటున్నారు పండితులు. జెర్రీ ఇంటి ప్రధాన ద్వారం నుంచి బయటకు వెళ్లినట్లు కనిపిస్తే సమస్యలను తనతో తీసుకెళ్తున్నట్లు.