ఎన్ని కష్టాలు వచ్చినా.. స్త్రీలు అస్సలే చేయకూడని తప్పులివే!

Samatha

24 july  2025

Credit: Instagram

స్త్రీలు దేవతలతో సమానం. వీరికి సహనం చాలా ఎక్కువ అంటారు. ఇక హిందూ సంప్రదాయంలో స్త్రీలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.

ఇక హిందూ పురాణాల్లో ఉన్న అనేక గ్రంథాలలో గరుడ పురాణం ఒకటి. అయితే దీని ప్రకారం స్త్రీలు కొన్ని తప్పులు అస్సలే చేయకూడదంట.

గరుడ పురాణం స్త్రీలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, చేయకూడని కొన్ని తప్పుల గురించి తెలియజేయడం జరిగింది. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

గరుడ పురాణం ప్రకారం, ఏ స్త్రీ అయినా సరే తన భర్తకు ఎక్కువ కాలం దూరం అస్సలే ఉండకూదంట. ఇది వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుందంట.

అలాగే పెళ్లైన మహిళలు తప్పకుండా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలంట. ఎట్టి పరిస్థితుల్లో వారు సూర్యోదయం తర్వాత నిద్రపోకూడదంట.

స్త్రీలు వారు ఎంత దగ్గరి బంధువులు అయినప్పటికీ, అలాగే మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా, ఇతరులు ఇళ్లల్లో ఎక్కువ కాలం అస్సలే ఉండకూడదంట.

ఎప్పుడు కానీ, ఏ స్త్రీ అయినా సరే, జన సంచారం లేని ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లకూడదంట. ఇది చాలా ప్రమాదకరం అంట.

ఎప్పుడూ కూడా స్త్రీలకు పురుషులతో అతి స్నేహం మంచిదికాదు, అలాగే, ఏ మహిళకూడా మద్యపానం, ధూమపానం చేయకూడదంట.