మిక్సీలో వీటిని గ్రైండ్ చేస్తున్నారా.. జాగ్రత్త, లేకపోతే ప్రమాదం జరగడం ఖాయం!
16 January 2025
samatha
ఇప్పుడు మిక్సీ లేని ఇళ్లే లేదు. ప్రతి ఇంట్లో మిక్సీ వాడుతున్నారు. దీంతో ఎఫ్పుడు ఏది కావాలన్నా సరే చేసుకోవడం ఈజీ అయిపోయింది.
ఎక్కువగా మసాలాలు, అల్లం వెల్లుల్లి చేయడం, పచ్చళ్లు నూరడానికి మిక్సీనీ వాడుతుంటారు. అంతే కాకుండా జ్యూస్ కూడా కొందరు మిక్సీలోనే చేసుకుంటారు.
అయితే కొన్నింటిని అస్సలే మిక్సీలో గ్రైండ్ చేయకూడదంట. దీని వలన అనేక సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందంట.
ఇంతకీ ఆ పదార్థాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొందరు కాఫీ గింజలను మిక్సీలో గ్రైండ్ చేస్తుంటారు. అస్సలే ఇలా చేయకూడదంట. దీని వలన మిక్సీలోని బ్లేడ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట.
అలాగే, జ్యూస్ చేసుకునే వారు ఐస్ క్యూబ్స్ వేస్తూ, మ్యాంగో జ్యూస్, మిల్క్ షేక్ వంటివి తయారు చేస్తారు కానీ దీని వలన జార్ బ్లేడ్స్ పాడవుతాయంట.
అంతే కాకుండా ఏదైనా ఫంక్షన్ జరిగితే చాలు మసాల దినుసలు పట్టడం చాలా పెద్దపని అయితే,మసాలా పొడి చేసే సమయంలో దాల్చిన చెక్క, జాజికాయను కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తారు కానీ దీని వలన మిక్సీ పాడవుతుందంట.
వీటిని మిక్సీలో వేయడం వలన జార్ బ్లేడ్ విరిగిపోయే ప్రమాదం ఉన్నదంట. అందువలన వీలైనంత వరకు దాల్చిన చెక్క, జాజికాయను మిక్సీలో పట్టకపోవడమే మంచిదంట.
వేడి పదార్థాలను, జార్ పై ఒత్తిడి తెచ్చే ఆహారాలను అస్సలే మిక్సీలో వేసి గ్రైండ్ చేయకూడదంట. దీని వలన జార్ బ్లేడ్ పై ఎఫెక్ట్ పడి మిక్సీ పాడవుతుందంట.