వర్షకాలం వచ్చిందంటే చాలు వ్యాధులు స్వైర విహారం చేస్తుంటాయి. జలుబు, తగ్గు, జ్వరం వంటి అనేక సమస్యలు చుట్టుముడుతుంటాయి.
ముఖ్యంగా కాలంలో చాలా వరకు పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురి అవుతారు. అందువలన ఈ సీజన్‌లో పిల్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కాగా, వర్షకాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఇప్పుడు చూద్దాంవర్షాకాలంలో పిల్లల పరిశుభ్రతపై తల్లిదండ్రులు చాలా శ్రద్ధతీసుకోవాలంట.
ఎందుకంటే వారు ఎక్కువగా బయట, బురదలో ఆడుకుంటుంటారు. కాబట్టి పిల్లల కాళ్లు, చేతులు పదే పదే నీటుగా కడగాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుందంట.
వర్షకాలంలో జీర్ణక్రియ అనేది చాలా బలహీనంగా ఉంటుంది. అందువలన ఈ సీజన్‌లో వారికి బయట ఫుడ్ పెట్టడం వలన కడుపు సంబంధమైన సమస్యలు వస్తాయంట.
అదే విధంగా, ఈ సీజన్‌లో ఇంటిలో పరిశుభ్రత పాటించాలి. ఎందుకంటే తేమ ఎక్కువగా ఉండటం వలన దోమలు , కీటకలు ఎక్కువగా ఉంటాయి.
దీంతో డెంగ్యూ జ్వరం, చికన్ గుణ్య వంటి వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందువలన వర్షకాలంలో పిల్లల హెల్త్ పట్ల జాగ్రత్త అవసరం.
వర్షకాలంలో పిల్లలకు కాచి చల్లార్చిన నీటిని తాగించాలి. ఇది వారి ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన పిల్లల్లో కడుపు సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.