వామ్మో.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎన్ని సమస్యలో..?

samatha 

04 JUN  2025

Credit: Instagram

ప్రస్తుతం చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కరోనా తర్వాత నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసే వారి సంఖ్య పెరిగింది.

అయితే ఇంటి దగ్గర కూర్చొని పని చేయడం వలన అనేక సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు వైద్యలు. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇంటి నుంచి పని చేసే సమయంలో అధిక స్క్రీన్ వాడకం, అలాగే, కదలిక తగ్గడం, సిట్టింగ్ కరెక్ట్ గా లేకపోవడం వలన వెన్ను నొప్పి, తలనొప్పి, కంటి సమస్యలు పెరుగుతున్నాయంట.

అలాగే కూర్చొని పని చేసే చోటు నుంచి కదలిక పోవడం, అతిగా తింటూ పని చేయడం వలన బరువు పెరిగిపోవడమే కాకుండా చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారంట.

డ్యూటీ చేస్తున్నప్పుడు సరిగ్గా కూర్చోకపోతే వెన్ను నొప్పి, అలాగే సోఫా, చిన్న చిన్న కుర్చీలపై కూర్చొని పని చేయడం వలన మెడ, వెన్ను, భుజం నొప్పి పెరుగుతుందంట.

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారు పని చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. దీని వలన నిరంతరం స్క్రీన్ చూడటం వలన కళ్లపై ఒత్తిడి పెరిగి, తలనొప్పికి కారణం అవుతుందంట.

ల్యాప్ టాప్ లేదా, మొబైల్ ఫోన్ ఎక్కువ సేపు చూడటం వలన అది కళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందంట. దీని వలన కళ్ళు పొడిగా మారడం,అస్పష్టంగా కనిపించడం జరుగుతుందంట.

అలాగే  రాత్రి సమయంలో ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం అనేది చాలా ప్రమాదకరం. దీని వలన మెదడు నిరంతరం చురుకుగా ఉంటుంది. దీంతో నిద్ర నాణ్యత తగ్గడమే కాకుండా అనారోగ్యసమస్యలు వస్తాయంట.