ఎర్ర మిరపకాయలు ప్రతి ఒక్కరికీ తెలుసు. వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా కారం పొడి చేసి ప్రతి వంటకంలో దీనిని వాడతారు.
ఏ వంటల్లో అయినా సరే దీనిని ఎక్కువగా ఉపయోగించడం వలన ఇది వంటలకే అద్భుతమైన రుచిని తీసుకొస్తుంది. రుచిని ఇవ్వడమే కాకుండా దీంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.
ఎండు మిర్చీలో విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు ఎక్కువగా ఉండటం వలన ఇవి శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయంట.
అలాగే ఎండు మిర్చీలో ఉండే క్యాప్సై సిన్ అనే రసాయం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుందంట.
ఎర్ర మిరపకాయల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వలన ఇది కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.
ఎర్ర మిరపకాయల్లో ఉండే విటమిన్స్, రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు నుంచి మిమ్మల్ని రక్షిస్తుందంట.
ఎవరైతే రక్త హీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది రక్తాన్ని శుభ్రపరిచి రక్తం పెరిగేలా చేస్తుందంట.
అలాగే వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించి, క్యాన్సర్ , గుండె జబ్బుల వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.