అయోడిన్ లోపం.. థైరాయిడ్ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సినవి ఇవే!

Samatha

18 august  2025

Credit: Instagram

ప్రస్తుతం చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలో థైరాయిడ్ ఒకటి. చాలా మంది దీని బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు.

తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి, పని ఒత్తిడి వంటి సమస్యల వలన మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పెరుగుతున్నాయి.

ఇక థైరాయిడ్‌కు అవసమైన ఖనిజాల్లో అయోడిన్ కీలకమైనది. ఇది థైరాయిడ్ గ్రంథి సాధారణంగా పనిచేసేలా చేస్తుంటుంది.

అయోడిన్ అనేది హార్మోన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇది ట్రై అయోడోథైరోనిన్, టెట్రా అయోడోథూరోనిన్ వంటి వాటిని ఉత్పత్తి చేస్తుంది.

అందుకే వైద్య నిపుణులు తప్పకుండా రోజూ వారి ఆహారంలో శరీరానికి సరిపడ అయోడిన్ తీసుకోవాలి. కనీసం 150 మైక్రోగ్రాములు తీసుకోవాలని సూచిస్తారు.

ఒక వేళ అయోడిన్ లోపం ఉంటే ఇది థైరాయిడ్ గ్రంథి వాపుకు దారితీస్తుందంట. దీని వలన గాయిటర్ వంటి సమస్య తలెత్తుతుంది.

అందుకే థైరాయిడ్ సమస్యలకు చెక్ పెట్టాలంటే, రోజూ వినియోగించే అయోడిన్ మొత్తాన్ని పెంచడానికి అయోడైజ్డ్ ఉప్పును వంటల్లో చేర్చుకోవాలంట.

పెరుగు కూడా అయోడిన్ పెరుగుదలకు చాలా మంచిది, దీనిని ప్రతి రోజూ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది శరీరంలో అయోడిన్‌ను పెంచుతుంది

ప్రతి రోజూ ఒక కోడి  గుడ్డు తినడం వలన శరీరానికి ఎక్కువ మొత్తంలో అయోడిన్, మంచి పోషకాలు లభిస్తాయని సూచిస్తున్నారు నిపుణులు.

బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన దీనిని ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వలన ఇది శరీరంలోని అయోడిన్ శోషణను తగ్గిస్తుందంట.