పీచు పండ్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Samatha
24 july 2025
Credit: Instagram
పీచు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి అయితే వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
పీచు పండ్లు క్రమం తప్పకుండా తినడం వలన ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఈ పండ్లలో 2.4 గ్రా ఫైబర్ ఉంటుంది. అందు వలన వీటిని తినడం వలన జీవక్రియ సక్రమంగా సాగుతుంది. అలాగే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందంట.
పీచు పండ్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ ఎల్ డీ ఎల్ కొలెస్ట్రాల్ రక్తపోటును తగ్గించి గుండె పనితీరును మెరుగు పరుస్తాయి.
పీచు పండ్లలో దాదాపు 88 శాతం నీరు ఉండటం వలన వీటిని తినడం వలన ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. అలాగే నీరసం, అలసటను తగ్గిస్తాయంట
చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంల పీచు పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, కొల్లాజెన్ చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయి.
కంటి ఆరోగ్యానికి కూడా పీచు పండ్లు చాలా మంచివి. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, కళ్లను రక్షించడమే కాకుండా, కంటి చూపును మెరుగుపరుస్తుంది.
పీచు పండ్లలో మితమైన గ్లైసెమిక్ ఉంటుంది. ఇది రక్తంలోని చక్కరస్థాయిలను పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుతాయి.