వాము ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Samatha

28 october 2025

వాము ఆకులు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా శీతాకాలంలో వీటిని  తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. అవి ఏవంటే?

వాము ఆకులను నీటిలో మరిగించి తాగడం వలన ఇది శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు , శ్వాస సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

వాము ఆకుల రసం తాగడం వలన ఇది గొంతు నొప్పి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శ్వాస తీసుకోవడం ఉండే ఇబ్బందులను తగ్గిస్తుంది.

వాము ఆకుల్లో విటమిన్ ఎ, సి , జింట్ , సెలీనియం, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన ఇది ఆరోగ్యానికి మంచిది.

వాము ఆకలు తినడం వలన ఇది జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. అజీర్ణం, గ్యాస్ , ఎసిడిటీ, మలబద్ధకం, వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

వాము ఆకలు రసం పిల్లలకు ఇవ్వడం చాలా మంచిది. దీని వలన పిల్లల్లో కడుపు సమస్యలు తగ్గిపోయి, ఆకలి పెరుగుతుదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

వాము ఆకులును నీటిలో మరగబెట్టి ప్రతి రోజూ దీనిని తీసుకోవడం వలన ఇది ఎముకలకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి.

వాము ఆకుల కషాయం తాగడం వల్ల ఋతుస్రావం సమయంలో మహిళలు అనుభవించే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.