ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం తప్పక తీసుకోవాల్సిన ఫ్రూ
ట్స్ ఇవే!
Samatha
13 july 2025
Credit: Instagram
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు ఒక పండైనా తినాలంటారు.
ఇక కొన్ని పండ్లు తినడం వలన అవి కొన్ని రకాల క్యాన్సర్‌ల నుంచి రక్షణ కలిగించడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తాయి.
అయితే పండ్లు తినడం వలన ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని సార్లు ఇవి జీర్ణక్రియకు మంచివి కావు అని చెబుతున్నారు నిపుణ
ులు.
కాగా, అసలు ఏ రకమైన పండ్లు గట్ హెల్త్‌కు మంచిది? వేటిని తినడం వలన అది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి గట్ హెల్త్‌కు చాలా మంచిది. అందువలన దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుందంట.
భోజనం తర్వాత పైనాపిల్ ను మితంగా తీసుకోవడం వలన ఇది జీర్ణక్రియను మెరుగు పరచడమే కాకుండా, ఉబ్బరం, గ్యాస్ , ఎసిడిటి సమస్యలను తగ్గిస్తుంది.
అధిక ప్రోటీన్ ఉండే పండ్లలో జామ పండు ఒకటి. అయితే దీనిని భోజనం చేసిన తర్వాత ఒకటి తినడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగిపోతుందంట.
అయితే భోజనం చేసిన తర్వాత వీలైనంత వరకు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోకూడదంట. ఇవి జీర్ణక్రియకు ఆటకం కలిగిస్తాయని చెబుతున్నారు నిప
ుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఈ చిన్న తప్పులే మీ ఇంట్లో సంపద పోయేలా చేస్తాయి!
భార్య వలన తగ్గుతున్న భర్త ఆయుష్షు..అసలు ముచ్చట ఏమిటంటే?
నారింజే కాదండోయో.. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఇవే!