అసలే వర్షాకాలం.. ఈ పండ్లు తింటే అంతే సంగతి!

Samatha

8 august  2025

Credit: Instagram

వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక వ్యాధులు స్వైర విహారం చేస్తాయి. అంతే కాకుండా నీరసం, అలసట ఎక్కువైపోతుంది.

అందుకే వర్షకాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని, మంచి పోషకవిలువలు కలిగి ఆహారం తీసుకోవాలంట.

ఇక కొంత మంది వర్షకాలంలో ఎక్కువగా పండ్లు తినడానికి ఆసక్తి చూపుతారు. అయితే వర్షకాలంలో పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే.

కానీ ఈ సీజన్‌లో ఖాళీ కడుపుతో అస్సలే కొన్ని రకాల పండ్లు తీసుకోకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

పైనాపిల్ వర్షాకాలంలో ఖాళీకడుపుతో తీసుకోవడం వలన ఇది కడుపులో ఆమ్లత్వాన్ని పెంచి కడుపు నొప్పివంటి సమస్యలకు కారణం అవుతుందంట.

వర్షాకాలంలో ఖాళీకడుపుతో మామిడిపండ్లు అస్సలే తీసుకోకూడదంట. దీని వలన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి, బరువు పెరుగుతారంట.

అదే విధంగా, ద్రాక్ష పండ్లు కూడా ఖాళీకడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

వర్షాకాలంలో ఖాళీకడుపుతో అరటి పండ్లు తినడం వలన గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయంట. అందుకే అరటి ఖాళీకడుపుతో తినకూడదంట.