బాదంతో పాటు అస్సలే తీసుకోకూడని ఆహారపదార్థాలు ఇవే!

24 october 2025

Samatha

ఆరోగ్యాన్నిచ్చే డ్రై ఫ్రూట్‌లలో బాదం ఒకటి. బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా రోజూ డ్రై ఫ్రూట్ తీసుకోవాలని చెబుతుంటారు నిపుణులు.

అయితే బాదం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల ఆహార పదార్థాలతో వీటిని అస్సలే తీసుకోకూడదంట. లేకపోతే అనేక సమస్యలు వస్తాయంట.

బాదంను ఎప్పుడూ కూడా పాల ఉత్పత్తులతో తీసుకోకూడదంట. పాలలో ఉండే కేసిన్ అనే ప్రోటీన్, బాదంలోని ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది.

అందువలన బాదం, పాల ఉత్పత్తులు కలిపి తినడం వలన ఇది కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి, వంటి సమస్యలకు కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు.

ఎప్పుడూ కూడా బాదంప్పులను సిట్రస్ ఫ్రూట్స్‌తో కలిపి తీసుకోకూడదు. పుల్లటి వాటితో బాదం తినడం వలన ఇందులోని ఆమ్ల స్వభావం జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందంట.

పాల కూర, బీట్ రూట్, చిలగడదుంప వంటి వాటితో కూడా బాదం పప్పులను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది కిడ్నీ సమస్యలను తీసుకొస్తుందంట.

శుద్ధి చేసిన చక్కెరలతో కూడా బాదం తీసుకోవడం ప్రమాదకరం. బాదం సహజంగానే కొవ్వు, కేలరీలను కలిగి ఉంటుంది. దీనిని చక్కెరతో తీసుకోవడం వలన బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.

అంతే కాకుండా స్నాక్స్, ఎక్కువగా ఉప్పు కలిగిన చిప్స్ వంటి వాటితో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బాదంపప్పులను తీసుకోకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.