లివర్ ఆరోగ్యం కోసం ఉదయాన్నే చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే!
20 october 2025
Samatha
ఒక వ్యక్తి శరీరంలో లివర్, కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ముఖ్యంగా కాలేయం శరీరంలోని విషాన్ని ఫిల్టర్ చేసి, రక్తంలోని చక్కెర స్థాయిలను నివారిస్తుంది.
అంతే కాకుండా ఇది వ్యక్తి పూర్తి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే ఎప్పుడూ కూడా లివర్ ఆరోగ్యం విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట, అవి ఏవి అంటే?
ప్రతి రోజూ ఉదయం బెర్రీ పండ్లు తీసుకోవడం చాలా మంచిది. వీటిలో ఉండే పోషకాలు లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఆక్సీకరణ, ఒత్తిడి, వాపు నుంచి తగ్గిస్తాయి.
కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు కాఫీ తాగడం వలన దీర్ఘకాలిక కొవ్వు లేదా కాలేయ వ్యాధీ వచ్చే ప్రమాదం తగ్గుతుందంట.
అలాగే వ్యాయామం అనేది తప్పనిసరి, ప్రతి రోజూ ఉదయం కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం చేయడం వలన కాలేయ కొవ్వు తగ్గుతుంది.
ప్రతి రోజూ ఉదయం విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే వాల్ నట్స్, డ్రై ఫ్రూట్స్ తినాలంట, ఇది కాలేయాన్ని రక్షిస్తుందంట.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ,లీన్ ప్రోటీన్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం తప్పనిసరి.
అలాగే ఎప్పుడూ కూడా ప్రాసెస్ చేసిన ఫుడ్, అతిగా చక్కెర ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదంట. ఇవి లివర్ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయంట.