ప్రాణం జర పైలం.. ఆస్తమా పేషెంట్స్ ఇవి తిన్నారో, బండి షెడ్డుకే!
18 September 2025
Samatha
చాలా మంది ఆస్తమా సమస్యతో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారు ఎలాంటి ఆహారాలకు దూరం ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆస్తమా పేషెంట్స్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
కాగా, అసలు ఆస్తమా సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వారికి ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం.
పాల ఉత్పత్తులకు సంబంధించిన ఆహారపదార్థాలు ఆస్తమా పేషెంట్స్ అస్సలే తీసుకోకూడదు. దీని వలన అలెర్జీ, ఉబ్బసం వంటి సమస్యలు వస్తాయి.
అలాగే, ఆస్తమా వ్యాధితో బాధపడే వారు అస్సలే ఉప్పు అతిగా తీసుకోకూడదు.దీని వలన గొంతు వాపు వచ్చి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురు అవుతాయి.
ఆస్తమా వ్యాధి ఉన్నవారు వేరుశనగలు కూడా తీసుకోకూడదు. ఇవి ఆస్తమా సమస్యతో బాధపడే వారికి చాలా హానికరం దీని వలన దగ్గు, ఉబ్బసం సమస్య ఎక్కువ అవుతుంది.
ఆస్తమా వ్యాధి ఉన్నవారు, మద్యం సేవించడం చాలా ప్రమాదకరం. దీని వలన అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్నదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అలాగే ఆస్తమా ఉన్న వారు ఎట్టిపరిస్థితుల్లో పాలు తాగకూడదంట. నోట్ : పై వార్త ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.