ఆస్తమా పేషెంట్స్ అస్సలే తీసుకోకూడని ఆహార పదార్థాలు ఇవే!

samatha 

6 MAY 2025

Credit: Instagram

ప్రస్తుతం చాలా మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. ఇది ఓ దీర్ఘకాలిక శ్వాస కోశ సమస్య. దీని వలన చాలా ఇబ్బందులు వస్తుంటాయి.

విపరీతమైన అలసట, సరిగ్గా నిద్రలేకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే ఈ సమస్యతో బాధపడే వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాలంట.

ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలకు, పానీయాలకు చాలా దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవి అంటే?

ఆస్తమాతో బాధపడుతున్న వారు అస్సలే వేడి చేసే ఆహారాలు. ముఖ్యంగా ఊరగాయలు తినకూడదు. ఇది సమస్యను తీవ్రతరం చేస్తుంది.

అదే విధంగా కొంత మంది కెఫైన్ అధికంగా తీసుకుంటారు. కాఫీ లేదా టీ ఎక్కువగా తాగుతుంటారు. ఇది కూడా ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట

ఆస్తమాతో బాధపడే వారు చాలా వరకు ప్రాసెస్ చేసిన ఫుడ్‌కు దూరంగా ఉండాలంట. లేకపోతే మీ నిర్లక్ష్యమే మీకు అనేక ఇబ్బందులను తీసుకొస్తుందంటున్నారు వైద్యులు.

ప్రస్తుతం చాలా మంది చైనీస్ ఫుడ్ ఇష్టపడుతున్నారు. కానీ ఇది ఆస్తమా పేషెంట్స్‌కు అస్సలే చాలా మంచిది కాదంట. అందుకే వీరు అస్సలు తినకూడదంట.

అదే విధంగా చల్లటి వస్తువులు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, స్ట్రీట్ ఫుడ్ వంటి వాటికి చాలా దూరంగా ఉండాలంట. లేకపోతే అది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందంట.