వర్షకాలంల ఈ పండ్లు తిన్నారో.. సమస్యల్లో చిక్కుకున్నట్లే!

Samatha

4 july  2025

Credit: Instagram

వర్షాకాలంలో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. అందువలన ఈ సీజన్‌లో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు.

అయితే కొంత మంది తెలిసి తెలియక కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటూ సమస్యలను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో అస్సలే కొన్ని రకాల పండ్లు తినకూడదంట. అవి :

లీచి పండ్లు ఆరోగ్యానికి మంచివే, కానీ వీటిని అస్సలే వర్షాకాలంలో తినకూడదంట. ఇవి తేమతో కూడిన గాలి వలన త్వరగా చెడిపోతాయంట. అలాగే గట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంట.

అదే విధంగా లీచీలో అధిక చక్కెర శాతం ఉంటుంది. అందువలన దీనిని వర్షాకాలంలో తినడం వలన జీర్ణక్రియ మందగించి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయంట

అలాగే, వర్షాకాలంలో పైనాపిల్ తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదంట. దీని వలన కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు అధికం అవుతాయంట.

వర్షాకాలంలో పుచ్చకాయ అస్సలే తినకూడదంట. ఇది ఎక్కువ నీటిని కలిగి ఉంటుంది. అందువలన వర్షాకాలంలో పుచ్చకాయ తినడం వలన జీర్ణక్రియపై ప్రభావం పడుతుందంట.

అదే విధంగా వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో కర్భూజాను తినకూడదంట. ఇది కడుపు నొప్పి, కొన్నిసార్లు వికారం, అలర్జీలకు కారణం అవుతుందంట.

అలాగే చాలా మంది మామిడి పండ్లు తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ వర్షాకాలంలో ఎట్టిపరిస్థితుల్లో మామిడి పండ్లు తినకూడదంట.