చాణక్యనీతి : ఇంటికి పేరు తెచ్చే స్త్రీలు వీరే..ఈ ఐదు లక్షణాలున్నవారు గొప్పవారే!

samatha 

2 july  2025

Credit: Instagram

ఆ చార్యచాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గొప్ప పండితుడు. ఎన్నో విషయాలను తన అనుభవాల ద్వారా తెలియజేయడం జరిగింది.

ఇక చాణక్యుడు బంధాలు, బంధుత్వం గురించి కూడా ఎంతో గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన గుణవంతురాలైన స్త్రీకి ఉండాల్సిన లక్షణాల గురించి తెలియజేయడం జరిగింది.

ఇంటిలోని ఒక స్త్రీ గుణవంతురాలు అయితే ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండటమే కాకుండా, సమాజంలో కూడా ఆ కుటుంబానికి మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

మంచి లక్షణాలు ఉన్న స్త్రీ, ప్రతి సంబంధంలో ప్రేమ, నమ్మకం, బంధంలో గౌరవాన్ని పొందుతారని ఆ చార్యచాణక్యుడు చెప్పడం జరిగింది.

కాగా, సమాజంలోని ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకొని, తమ మంచి ప్రవర్తన, ఆలోచనతో అందరి మనసు దోచుకునే మహిళలకు ఉండే లక్షణాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

చాణక్యుడి ప్రకారం, మర్యాద  కలిగిన స్త్రీలు అందరికీ నచ్చుతారు. వారు ఇతరులతో తియ్యగా మాట్లాడతారు, కుటుంబంలో శాంతిని కాపాడుతారు. అలాంటి వారు అదృష్టవంతులు.

కుటుంబ బాధ్యతలను అర్థం చేసుకొని, వాటిని నెరవేర్చడంలో వెనకాడని మహిళలు ప్రతి ఒక్కరి హృదయంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారని చెబుతున్నారు చాణక్య.

అదే విధంగా, స్వీయ నిగ్రహం కలిగిన మహిళ. తమ ప్రవర్తన, మాటల్లో మర్యాదను కాపాడుకునే స్త్రీలు సమాజంలో గౌరవించబడతారు. వారు అందరి మనసు దోచుకుంటారంట.