పొత్తికడుపులో నొప్పి వేధిస్తుందా.. ఇది ఆ క్యాన్సర్ లక్షణమేనేమో!
18 September 2025
Samatha
అపెండిక్స్ క్యాన్సర్ అనేది ప్రస్తుతం చాలా మందిని బాధపెడుతున్న సమస్య. అయితే దీని లక్షణాలు ప్రారంభంలో అంతగా తెలియవు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాపకిందనీరులా వ్యాపిస్తుంది. దీని వలన చాలా మంది అనేక మంది ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇప్పుడు మనం అపెండిక్స్ క్యాన్సర్ గురించి, దీని లక్షణాలు తెలుసుకుందాం.
పొత్తికడుపులో విపరీతమైన నొప్పి, ముఖ్యంగా కుడి వైపున ఎక్కువగా నొప్పి వస్తున్నట్లు అయితే దీనిని అస్సలే విస్మరించకూడదు, ఇది అపెండిక్స్ క్యాన్సర్ ప్రారంభ సంకేతం కావచ్చు అంటున్నారు నిపుణులు.
అదే విధంగా, గ్యాస్ , ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు, ముఖ్యంగా పొత్తికడుపులో తరచూ ఉబ్బరం లేదా వాపు ఉన్నట్లు అయితే మీకు అపెండిక్స్ క్యాన్సర్ ఉన్నట్లేనంట.
కొన్ని కొన్ని సార్లు మీ కడుపు గట్టిగా అవుతున్నట్లు అనిపిస్తే అస్సలే నిర్లక్ష్యం వహించకూడదంట. ఇది కూడా మీకు ప్రమాదకరం, అపెండిక్స్ క్యాన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చునంట.
ఎలాంటి కారణం లేకుండా వాంతులు అవ్వడం లేదా, కడుపు నొప్పి, వంటి సమస్యలు కూడా అపెండిసైటిస్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాల్లో ఒకటి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కొంత మంది ఆకస్మాత్తుగా బరువు తగ్గుతుంటారు. అయితే బరువు తగ్గడం వెనుక అనేక కారణాలు ఉన్నప్పటికీ, కొన్ని సార్లు ఆకస్మికంగా బరువు తగ్గడం కూడా అపెండిక్స్ క్యాన్సర్ కావచ్చు.
ఎప్పుడూ శరీరం ఎక్కువ వేడిగా ఉంటే కూడా జాగ్రత్తపడాలంట. నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.