ఆరోగ్యంగా ఉండాలా... తప్పకుండా ఈ డ్రింక్స్ తీసుకోకూడదంట!

Samatha

11 july  2025

Credit: Instagram

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎవరైతే తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారో వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారంటారు.

ఇక జీర్ణక్రియ సాఫీగా సాగితే ఆరోగ్యం బాగున్నట్లే, ఎందుకంటే జీర్ణక్రియ అనేది శరీరంలోని ఆహారాన్ని పోషకాలను విచ్ఛిన్నం చేసి, శక్తినిస్తుంది.

అలాగే ఆరోగ్యకరమైన జీర్ణక్రియ విటమిన్స్ గ్రహించి, వ్యర్థాలను తొలగిస్తుంది. అందుకే జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేసే మంచి ఫుడ్ తీసుకోవాలంటారు.

అయితే మనం తీసుకునే కొన్నిరకాల పానీయలు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయంట. కాగా, జీర్ణక్రియ సాఫీగా సాగాలంటే ఏ డ్రింక్స్‌కు దూరం ఉండాలో చూద్దాం.

కాఫీ,టీలల్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ వేగవంతమై, ఇది విరేచనాలు, తిమ్మరి వంటి సమస్యలకు కారణం అవుతుందంట.

అలాగే టీలోని టానిన్లు, పేగులోని పోషకాల శోషణను నిరోధిస్తాయంట, అందుకే, ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తీసుకోకూడదంట.

అదే విధంగా, ఫీజీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వలన  ఇవి జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయంట. గ్యాస్, ఉబ్బరం, బర్ఫింగ్ వంటి సమస్యలకు కారణం అవుతుందంట.

డైట్ ఫిజీ డ్రింక్స్ ఆరోగ్యకరమైనప్పటికీ, వీటిలో ఎక్కువ తీపి పదార్థం ఉండటం వలన ఇది గట్ బ్యాక్టీరియాపై తీవ్రప్రభావం చూపుతదంట. అందుకే ఈ పానీయాలకు దూరం ఉండాలంట.