నలభైఏళ్ల తర్వాత అధిక బుుతుస్రావమా?..కారణం ఇదే!

Samatha

17 july  2025

Credit: Instagram

పీరయడ్స్ సమయంలో కొందరికి అధిక బుుతుస్రావం కావడం సహజం. కానీ నలభై ఏళ్లు దాటిన వారిలో ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

కాగా, 40 ఏళ్లు దాటిన తర్వాత అధిక రక్తస్రావం కావడానికి గల కారణాలు ఏవి? ఎందుకు ఇలా అవుతుందో తెలుసుకుందాం.

పీరియడ్స్ సమయంలో రక్తస్రావం అనేది  సాధరణం కంటే ఎక్కువ రక్తస్రావం అయితే దానిని అధిక బుుతుస్రావం అంటారు.

ఇది సాధారణంగా ఐదు రోజులు లేదా అంతకు మించి ఉండవచ్చు.  అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు

హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ వంటి సమస్యల వలన నలభై ఏళ్లు పై బడిన మహిళల్లో అధిక బుుతుస్రావం అవుతుందంట.

అలాగే రుతువిరతి దశలో మహిళల్లో హార్మోన్లలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకే ఈ  సమస్య వస్తుందంట.

కొన్ని సార్లు రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు లేదా ఇతర సమస్యల వలన కూడా అధిక రక్త స్రావం అవుతుందని చెబుతున్నారు నిపుణులు.

అయితే కొన్ని సార్లు ఇది సాధారణం అయినప్పటికీ, దీని ప్రభావం ఎక్కువ రోజులు కొనసాగితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలంట.