విద్యార్థుల స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడానికి బెస్ట్ టిప్స్ ఇవే!

samatha 

19 MAY 2025

Credit: Instagram

ప్రస్తుతం విద్యార్థులు ఎక్కువ సేపు స్క్రీన్ ముందే ఉంటున్నారు. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు, కంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.

కాగా, విద్యార్థుల స్క్రీన్ టైమ్ తగ్గించడానికి అద్భుతమైన ఆరోగ్య చిట్కాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఎక్కువ సేపు స్క్రీన్ ముందు ఉండం వలన అది విద్యార్థుల దృష్టి, నిద్ర, అలాగే మొత్తం ఆరోగ్యం ప్రభావితం చేసే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు.

అందుకే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడానికి సరైన దినచర్యను పాటించాలంట. దీని కోసం కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయంటున్నారు. అవి వి అంటే?

ప్రతి రోజూ స్క్రీన్‌లపై ఎంత సేపు సమయం గడుపుతున్నారో వివరంగా తెలుసుకోవాలంట. దీని కోసం కొన్ని పరిమితులు కేటాయించుకోవాలి అంటున్నారు నిపుణులు.

అదే విధంగా,భోజనం చేసటప్పుడు, అలాగే చదువుకునే సమయంలో వీలైనంత వరకు సెల్ ఫోన్‌లకు చాలా దూరం ఉండాలంట.

అలాగేమీరు రోజూ ఎంత స్క్రీన్ ముందు ఉంటున్నారో తెలుసుకోవడానికి స్క్రీన్ టైమ్ ట్రాకింగ్ యాప్స్ ఉపయోగించాలంట దీని ద్వారా సమయం ఖచ్చితంగా తెలుస్తుంది.

అలాగే ఇంట్లో బెడ్ రూమ్ లేదా డైనింగ్ ఏరియా వంటి వద్ద టెక్ ఫ్రీ జోన్‌ను మీరే ఏర్పరుచుకోవాలి.టీవీ,ట్యాబ్స్, ఫోన్‌లను చాలా తక్కువగా ఉపయోగించాలి.