ఏంట్రా బాబు రాత్రి సమయంలో అస్సలే నిద్రపట్టడం లేదా.. ఇదిగో ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

23 october 2025

Samatha

నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది కంటినిండా నిద్రపోవాలి అనుకుంటారు. కానీ కొంత మంది సరైన సమయానికి సరిగ్గా నిద్రపోతుంటారు.

చాలా మంది నిద్రలేమి సమస్య ఎదుర్కొంటారు. సమయానికి నిద్రపట్టక అనేక ఇబ్బందులు పడతారు. అంతే కాకుండా అనారోగ్య సమస్యలను కూడా కొనితెచ్చుకుంటారు.

మరీ ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి త్వరగా నిద్ర పట్టాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

ఎక్కువ సేపు కదలకుండా ఉండటం వలన కూడా రాత్రి సమయంలో నిద్ర సరిగ్గా పట్టదంట, అందువలన మీరు ఎక్కువ సేపు నడవడం వలన రాత్రి సమయంలో త్వరగా నిద్రపోవచ్చు.

అదే విధంగా మీరు పడుకోవడానికి 10 నిమిషాల ముందే లైట్స్ ఆఫ్ చేయండి. దీని వలన త్వరగా నిద్రపడతుంది. మనసు ప్రశాంతంగా ఉండి, హాయిగా నిద్ర పడుతుంది.

కొంత మంది పడుకునే ముందు ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తుంటారు. అయితే త్వరగా నిద్రపోవాలి అంటే పడుకోవడానికి అర్ధగంట ముందు నుంచే ఫోన్ చూడకూడదంట.

చాలా మంది ఈ రోజుల్లో ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు, ఎంత త్వరగా రాత్రి సమయంలో భోజనం చేస్తే అంత త్వరగా నిద్ర పడుతుందంట.

అదే విధంగా కొందరు రాత్రి పడుకునే సమయంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు, ఒత్తిడికి లోను అవుతారు. అయితే పడుకునే ముందు ఎప్పుడూ కూడా అతిగా ఆలోచించకూడదంట.