జీవితంలో విజయం సాధించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరూ తమ లైఫ్‌లో పెట్టుకున్న ఏదో ఒక గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటారు.
కానీ కొంత మందిని మాత్రమే విజయం వరిస్తుంది. ఇంకొందరు ఎంత ప్రయత్నం చేసినా విజయం వరించదు. ఇక సక్సెస్ కోసం చేసే పోరాటంలో ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి.
కొన్ని సార్లు మన అనుకున్న వారి నుంచే వ్యతిరేకత రావడం, అనుకోని సమస్యలు ఎదురు అవ్వడం జరుగుతుంది. అయితే విజయం సాధించాలి అనుకునే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులను లెక్క చేయకూడదంట.
కొంత మంది ఇతరులపై ఎప్పుడూ వ్యతిరేక భావనతో ఉంటారు. అంతే కాకుండా, వారిపై ఎక్కువ నెగిటివిటీ చూపిస్తుంటారు. వారంటేనే ఈర్క్ష్యతో ఉంటుంటారు.
అయితే ఇతరుల నెగిటివిటీ, ఈర్ష్య చూసి కుంగిపోకూడదంటున్నారు నిపుణులు. నువ్వు ఎదుగుతున్నావు , ఎదుగుతావు అనే సమయంలోనే ఇతరులు మీపై ఈర్ష్య పడుతారు.
వారు ఈర్ష్య పడుతున్నారంటే మీరు సక్సెస్ అవుతున్నట్లే, అందుకే అలాంటి వారి నెగిటివ్‌ను మీరు పాజిటివ్‌గా తీసుకొని, సక్సెస్ వైపు ప్రయాణించాలని సూచిస్తున్నారు నిపుణులు.
ఎప్పుడూ కూడా ఇతరుల మాటలు, వారిని పట్టించుకోకుండా, నీ ధ్యేయం, నీ లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని, అదే టార్గెట్‌గా వర్క్ చేయాలంట. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు.
ఇక సక్సెస్ అనేది ఆటు పోటులు ఎదుర్కొన్న వారికి మాత్రమే వస్తుంది. భయపడి వెనకడుగు వేస్తే జీవితంలో ఓటమినే చూడాల్సి వస్తుంది, అందుకే ఇతరుల నెగిటివిటీతోనే దూసుకెళ్లాలంట.