తొలకరిచినుకుల్లో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ బీచ్‌లు ఇవే..ఎక్కడెక్కడున్నాయంటే?

samatha 

08  JUN  2025

Credit: Instagram

వర్షాకాలం వస్తే చాలా చాలా మంది పర్యాటకులు ఎంజాయ్ చేయడానికి పొగ మంచుతో కూడిన పర్వతాలు, లేదా పచ్చటి ప్రకృతి ఉన్న ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. 

కానీ వర్షాకాలంలో పైన నీలి ఆకాశం, కింద ఇసుక తెన్నెలు , ఎగిసిపడే అలలు, చిన్న చిన్న చిరుజల్లుల మధ్య ఎంజాయ్ చేస్తే ఆ ఆనందమే వేరే లెవల్ ఉంటుందంట.

అందుకే తప్పకుండా వర్షాకాలంలో బీచ్ కు వెళ్లాలంట. అయితే వానాకాలంలో భారత దేశంలో తప్పక సందర్శించవలసిన బెస్ట్ బీచ్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.

పలోలెం బీచ్ ఇది గోవాలో ఉన్న అతి సుందరమైన బీచ్. ఇక్కడి ప్రదేశం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందంట. అంతే కాకుండా వర్షాకాలంలో ఇక్కడ జనసాంధ్రత చాలా తక్కువ ఉంటుందంట. 

అందమైన టూరిస్ట్ ప్లేసెస్ లో కేరళ ముందుంటుంది. అయితే కేరళలోని ఎర్రటి కొండల పై ఉన్న వర్కాల బీచ్ వర్షాకాలంలో చూడటానికి చాలా అద్భుతమైన ప్రదేశం అంట. 

వర్షాకాలంలో ఈ బీచ్ చూడటానికి రెండు కళ్లు చాలవంట. అందుకే దక్షిణ భారతదేశంలో ఉన్న అందమైన బీచ్ లలో ఈ కోవలం బీచ్ ఒకటి కాబట్టి తప్పకుండా వర్షాకాలంలో ఇక్కడికి వెళ్లాలంట.

హైదరాబాద్ కు చాలా దగ్గరగా ఉండే బీచ్‌లలో కర్ణాటకలో ని కుడ్లే బీచ్ ఒకటి. ఇది చూడటానికి సీ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ చుట్టూ కొబ్బరి చెట్లు, ఉత్కంఠభరితమైన సూర్యోదయం, సూర్యస్తమయానికి ప్రసిద్ధి. 

శివాలయానికి చాలా దగ్గర ఉండే బీచ్ అంటే అందరికీ టక్కున గుర్తు వచ్చేది మహారాష్ఠ్రలోని వెల్నేశ్వర్ బీచ్. వర్షాకాలంలో ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉండటుంది