మనం ఎప్పుడూ గోర్లు కట్ చేసుకునే నెయిల్ కట్టర్ చివరన హోల్ ఎందుకు ఉంటుందో తెలుసా?

16 January 2025

samatha

గోర్లు కట్ చేసుకునే నెయిల్ కట్టర్ దిగువన హోల్ చూసి చాలా మంది ఇది ఎందుకు పెట్టారు? అసలు దీనితో ఏ ప్రయోజనం లేదు అనుకుంటారు.

కానీ దీని వలన చాలా  ఉపయోగాలు ఉన్నాయంట. కొన్ని పనులను సులభంగా చేయడానికి వీలుగా ఈ హోల్‌ను పెట్టడం జరిగిందంట.

అవి: నెయిల్ కట్టర్ బ్లేడ్‌లను తిప్పడానికి, వాటిని ఈజీగా ఓపెన్ చేయడానికి, మూసివేయడానికి ఈ హోల్ సహాయపడుతుంది.

అలాగే, నెయిల్ కట్టర్‌కు మంచి గ్రిప్ ఇవ్వడం దీని ముఖ్యమైన పని, కత్తిరించిన గోరు నెయిల్ కట్టర్‌లో ఇరుుక్కపోయే అవకాశం ఉంటుంది.

 అలాగే నెయిల్ కట్టర్ కీచైన్ లా ఉపయోగించుకోవడానికి కూడా ఈ హోల్ చాలా ఉపయోగపడుతుంది. దీంతో ఇది ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది.

అలాగే ఈ నెయిల్ కట్టర్ హోల్‌తో అల్యూమినియం వైర్, సన్నని వైర్లను ఈజీగా వంచడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

అదే విధంగా నెయిల్ కట్టర్ హోల్ దానికి మంచి లుక్ ఇస్తుంది. సిమెట్రికల్ డిజైన్‌తో క్లిప్పర్ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుందంట.

అలాగే కొంత మంది నెయిల్ కట్టర్‌ను పర్సనల్‌గా వాడుతారు. ఇతరులకు ఇవ్వడానికి అస్సలే ఇష్టపడరు. అప్పుడు మీరు మీ బ్యాగ్స్ కు కీ చైన్ లా ఉపయోగించవచ్చునంట.