చాలా మంది ఇష్టపడే కూరగాయల్లో టమాటాలు ముందుంటాయి. మార్కెట్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేయకుండా మాత్రం ఉండలేరు.
ఈ టమాటాలను సపరేట్‌గా వండినా, ఏ కర్రీలో వేసినా మంచి టేస్ట్ వస్తుంది. అయితే ఇది మంచి రుచిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందంట.
ముఖ్యంగా కనీసం రోజుకు ఒకటి పచ్చి టమాటో తిన్నా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు దాని గురించే మనం వివరంగా తెలుసుకుందాం.
టమాటాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందంట. ఆరోగ్యం బాగుంటుంది.
సూర్యుని హానికరమై కిరణాల నుంచి మిమ్మల్ని కాపాడటంలో కూడా ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. మీ చర్మాన్ని ఎండ నుంచి కాపాడి, చర్మానికి రక్షననిస్తుంది.
ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వారికి కూడా ఇది మంచిదంట. ప్రతి రోజూ ఒక పచ్చి టమాటో తినడం వలన త్వరగా బరువు తగ్గవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
టమాటోలో ఫైబర్, పొటాషియం, పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే తప్పకుండా ప్రతి రోజూ ఒక టమాటో తినాలంటున్నారు నిపుణులు
అలాగే టమాటోల్లో ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి6 వంటి అనేక పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన టమోటాలు తినడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది.