మృగశిర రోజు చేపలు తినడం వలన లాభాలు..అసలు ఎందుకు తినాలో తెలసా?

samatha 

01 JUN  2025

Credit: Instagram

మృగశిర కార్తె వచ్చేస్తుంది. ఇది వర్షాకాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇక ఈ సంవత్సరం జూన్8 వ తేదీన ఆదివారం రోజు మృగశిర కార్తె వస్తుంది.

ఈరోజు చేపలు తినడం అంతే కాకుంా చేప ప్రసాదం తినడం వలన శ్వాస కోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంటారు అంతే కాకుండా నేడు ప్రతి ఒక్కరూ చేపలు తింటారు.

అయితే ఇన్ని కార్తెలు ఉండగా, మృగశిర కార్తె రోజే చేపలు ఎందుకు తినాలి? దీని వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

మృగశిర కార్తె వస్తూనే చల్లదనాన్ని తీసుకొస్తుంది. ఈ కార్తె ప్రారంభంతో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోతుంది.ఇక ఈ రోజు మార్కెట్‌లో చేపలకు ఉండే గిరాకి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అన్ని రోజుల కంటే మృగశిర కార్తె రోజు చేపల మార్కెట్లు రద్దీగా ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు ప్రతి ఒక్కరూ చేపలు తింటారు. ఎందుకు అంటే?

రోహిణి కార్తెలో రోకడ్లు పగిలే ఎండలు కొడుతాయి అంటారు. అంటే అన్ని రోజుల కంటే రోహిణి కార్తెలో చాలా విపరీతమైన ఎండలు ఉంటాయి.

కానీ మృగశిర కార్తెతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. దీంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

అందుకే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి, జ్వరం, జలుబు వంటి సమస్యలు రాకుండా శరీరంలో వేడి పెంచుకునేందుకు ఈ రోజున చేపలు తినాలంటారు. కొందరు బెల్లం, ఇంగువ కలుపుకొని తింటారు.