డ్రాగన్ ఫ్రూట్‌ను చిన్న చూపు చూడకండి.. దీంతో ఎన్నో ప్రయోజనాలు..

samatha 

2 july  2025

Credit: Instagram

డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీనిని ప్రతి రోజూ తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంట. అవి ఏవో చూద్దాం.

డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని తింటే, ఇది రోగనిరోధక శక్తిని పెంచి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

అంతే కాకుండా డ్రాగన్ ఫ్రూట్, సీజన్ మారినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్, అలసట, వంటి సమస్యల నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే అధిక ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, గట్ బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి సహాయపడుతుంది.

అదే విధంగా డ్రాగన్ ఫ్రూట్‌లో నీటిశాతం దాదాపు 80 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా తక్షణ శక్తినిస్తుంది.

చర్మఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్స్, బీటాలైన్స్ వంటివి చర్మాన్ని నిగారింపుగా చేయడమే కాకుండా వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.

మధుమేహ వ్యాధి గ్రస్తులు ఈ పండును మితంగా తీసుకోవడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి, డయాబెటీస్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఒమేగా2 , ఒమేగా 9 వంటి కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.