టీ, కాఫీలు కాదండోయ్.. ఉదయాన్నే గులాబీ టీతాగితే ఎన్ని లాభాలో!
samatha
1 july 2025
Credit: Instagram
టీ, కాఫీలు తాగకుండా ఎవరుంటున్నారు చెప్పండి. చాలా మంది ఉదయం లేచిందంటే చాలు పరగడుపన కప్పు కాఫీ, లేదా టీ తాగడం కామన్.
అయితే ఇలా ప్రతి రోజూ ఉదయం టీ,కాఫీలు తాగడం కంటే, గులాబీ టీ తాగడం వలన బోలెడు లాభాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
ఎర్రటి గులాబీలతో తయారు చేసే రోజ్ టీని ప్రతి రోజూ తాగడం వలన శరీరానికి చాలా మేలు జరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎండబెట్టిన గులాబీ రేకులతో తయారు చేసే ఈ టీ తాగడం వలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయంట.
గులాబీ రేకుల్లో విటమిన్ సి, పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని ప్రతి రోజూ తాగడం వలన రోగనిరోధక శక్తి పెరిగి, శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
అలాగే మహిళల ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు, అధిక రక్తస్రావం నుంచి వచ్చే సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అదే విధంగా ఈ టీని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తాగడం వలన ఒత్తిడి, ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉంటారంట. నిద్ర లేమితో బాధపడేవారు ఈ టీ తాగడం వలన త్వరగా నిద్రపోతారు.
రోజ్ టీలో ఉండే యాంటీ, ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని నొప్పులు, వాపులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే కీళ్ల నొప్పులు ఉన్నవారు ప్రతి రోజూ తాగడం చాలా మంచిది.