బిర్యానీ ఆకుల టీ.. చలికాలంలో తాగడం ఎంత మంచిదో తెలుసా?

18 october 2025

Samatha

ప్రతి ఒక్కరి వంటరూమ్‌లో తప్పక ఉండాల్సిన వాటలో బిర్యానీ ఆకులు ఒకటి. ఇవి మంచి సువాసన ఇవ్వడమే కాకుండా,మంచి రుచిని కూడా ఇస్తాయి.

అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా వంటకాల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాల్లో తప్ప కుండా ఈ బిర్యానీ ఆకులనేవి ఉంటాయి.

ఇక వీటి వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు నుంచి సత్వర ఉపశమనం కలిగిస్తాయంట.

శీతాకాలంలో బిర్యానీ ఆకుల టీ తాగడం వలన ఇది జీర్ణ క్రియను మెరుగు పరిచి, అజీర్ణం , మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందంట.

బిర్యానీ ఆకుల టీ రోజూ తాగడం వలన ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

చలికాలంలో బిర్యానీ టీ తాగడం వలన ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమెంటరీస్ జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఇస్తాయి.

రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. డయాబెటీస్ రోగులు బిర్యానీ ఆకుల టీ తాగడం వలన ఇది డయాబెటీస్ తగ్గిపోతుంది.

బిర్యానీ ఆకుల టీ శరీరం నుంచి విషయాన్ని తొలిగిస్తాయి. అంతే కాకుండా శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి, చర్మాన్ని నిగారింపుగా, అందంగా తయారు చేస్తుంది.