కారం కాదండోయ్.. మిరపకాయతో బోలెడు లాభాలు!

Samatha

18 july  2025

Credit: Instagram

కర్రీల్లో పచ్చి మిర్చి అనేది తప్పనిసరిగా ఉంటుంది. దీనిని వంటల్లో వేసుకోవడం వలన ఆ వంటకాలకే మంచి రుచి వస్తుంది.

అందుకే ప్రతి ఒక్కరూ కూరల్లో తప్పకుండా పచ్చిమిర్చి వేస్తుంటారు. కానీ టేస్టే కాదండోయ్ దీని వలన బోలెడు ప్రయోజనాలున్నాయి.

పచ్చి మిర్చిలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్ , పొటాషియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

పచ్చి మిర్చిని ప్రతి రోజూ వంటల్లో వేసుకోవడం వలన ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

పచ్చిమిరపకాయలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.  దీనిని తినడం వలన ఇది బరువును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.

పచ్చి మిర్చీలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అందువలన ఇది కళ్లకు, చర్మానికి మేలు చేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు

పచ్చి మిర్చీలో బీటా కరోటిన్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పచ్చి మిర్చీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు శక్తిని అందించడమే కాకుండా క్యాన్సర్ నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది.