వర్షాకాలంలో ఇంట్లో పెంచుకొనే ఐదు అందమైన మొక్కలు ఇవే!

Samatha

8 august  2025

Credit: Instagram

వర్షాకాలం వస్తే చాలు, చాలా మంది తమ ఇంటి గార్డెన్‌ను రంగు రంగుల అందమైన మొక్కలతో నింపేయ్యాలని అనుకుంటారు.

ఎందుకంటే? వర్షాకాలంలో తేమ కారణంగా మొక్కలు త్వరగా వేపుగా పెరగడమే కాకుండా, త్వరగానే పుష్పిస్తాయి.

అయితే ఇప్పుడు మనం వర్షాకాలంలో ఇంటింలో పెంచుకొనే అందమైన మొక్కలు ఏవో, వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

గుల్మెండి ( గోరింట) ఇవి చాలా రంగుల్లో ఉంటాయి. వర్షాకాలంలో ఇంట్లో పెంచుకోవడానికి అందమైన మొక్కల్లో ఇది ఒకటి.

చామంతి పూలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ పూలు చాలా మందికి ఇష్టం. అయితే  వర్షాకాలంలో పెంచుకునే మొక్కల్లో ఇవి కూడా ఒకటి.

బంతి పూలు. ఇవి మూడు నాలు రంగుల్లో పుష్పిస్తాయి. అయితే పూల మొక్కలు చాలా సులభంగా పెరగుతాయి. వర్షకాలంలో పెంచుకోవడానికి బెస్ట్ పూల మొక్క.

జిన్నీయా వీటిని రకరకాల పేర్లతో పిలుస్తారు. కొందరు పట్నం బంతి అంటారు. ఈ పూలు చాలా అందంగా ఉంటాయి. వర్షాకాలంలో త్వరగా పెరుగుతాయి.

వర్షాకాలంలో త్వరగా పెరిగే మొక్కల్లో మందారం ఒకటి. ఇందులో అనేక రకాలు ఉంటాయి. వర్షాకాలంలో వీటిని పెంచుకోవడం సులభం.