చాణక్యనీతి పొదుపు మత్రం.. ఇలా చేస్తే డబ్బు ఆదా చేయోచ్చు!

samatha 

22 JUN  2025

Credit: Instagram

ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం లేదు ఈయన గొప్ప పండితుడు. అనేక విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.

అయితే ఆచార్య చాణక్యుడు చాలా విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. అవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

చాణక్యడు డబ్బు, సంపద, ఖర్చు , పొదుపు వంటి విషయాల గురించి కూడా తన నీతి శాస్త్రంలో తెలిపాడు. అయితే ఒక వ్యక్తి డబ్బును పొదుపు చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలన్నాడు. అవి :

కష్ట సమయాల్లో ఆనందంగా ఉండాలంటే మీ చేతినిండా ఉన్నప్పుడే సంపదను కూడబెట్టుకోవాలని చాణక్యుడు తన నీతిశాస్త్రం తెలిపారు.

అలాగే సంపాదించే ప్రతి వ్యక్తికి డబ్బుపై అవగాహన ఉండాలి. మరీ ముఖ్యంగా ఆర్థిక ప్రణాళిక ఉండాలి. అది లేకపోతే డబ్బు సంపాదించడం వ్యర్థం అని చెబుతున్నాడు.

చాణక్యుడు సంపద కంటే జ్ఞానానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాడు. జ్ఞానం లేని వాడు ఎంత డబ్బు సంపాదించినా అది భారం లాంటిదే అని తెలుపుతున్నారు.

చిన్న చిన్న సమస్యలే రేపు పెద్ద సమస్యకు కారణం అవుతాయి. అందువలన చిన్న సమస్యలను విస్మరించకుండా మీ సపాదనకు మీరే మార్గం వేసుకోవాలంట.

ఎంత సంపాదన ఉన్నా ఆ వ్యక్తి పని చేయకపోతే ఆ డబ్బు వృధా అంటున్నాడు చాణక్యుడు. ఎందుకంటే పని చేయకపోతే ఆ సంపద కొండైనా కరిగిపోతుందంట.