ఈ జంతువులు లెక్కల్లో తోపు.. క్యాలిక్యులేటర్ కూడా అంత షార్ప్‌గా పనిచేయదంట!
Samatha
3 july 2025
Credit: Instagram
చాలా వరకు మనుషులు మాత్రమే ఎక్కువగా లెక్కపెట్టడం, లెక్కలు చేయడం చేస్తారని అందరూ అనుకుంటారు, కానీ కొన్ని రకాల జంతువులు కూడా లెక్కల్లో తోపుఅంట.
అవి లెక్కలు పెడుతూ, తమ పనులను తాము జాగ్రత్తగా సజావుగా చేసుకుంటాయంట. కాగా, ఏ జీవులు గణితంలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
సింహాలు గణితంలో మొదటి స్థానంలో ఉంటాయి. ఇవి తమ పోటీ ప్రత్యర్థి గర్వాల నుంచి దాడి చేయాలా వద్దా అని నిర్ణయించుకునేందుకు వాటి గర్జనలను లెక్కిస్తాయంట.
చింపాంజీలు మానవుల కంటే చిహ్నాలను ఎక్కువగా గుర్తిస్తాయి. ఇవి పజిల్స్‌ను చాలా సులువుగా పరిష్కరిస్తాయంట.
కూడికలు, తీసివేతల్లో పావురాలు ముందు వరసలో ఉంటాయంట. ఇవి ప్రయోగశాలల్లో పరీక్షల చిహ్నాలను అనుబంధించడం ద్వారా లెక్కలు నేర్చుకుంటాయంట.
తేనెటీగలు మకరందాన్ని కనుగొనడానికి ల్యాండ్ మార్కులను లెక్కించి, సున్నాను గ్రహిస్తాయంట. లెక్కల ద్వారా గమ్యస్థానాలు చేరుతాయంట.
గోల్డెన్ ఆర్బ్ వీర్ స్పైడర్స్, తమ వలలో చిక్కుకున్న ఎరల సంఖ్యను చాలా సులభంగా లెక్కిస్తాయంట. లెక్కించడంలో ఇవి మొదటి స్థానంలో ఉంటాయి.
లెక్కల్లో స్టింగ్రేలు, సిచ్లిడ్ల్ చేపలు తోపు. ఎందుకంటే? ఇవి రంగు రంగు గుర్తులను ఉపయోగించి, చిన్న సంఖ్యలను కలపడం తీసి వేయడం, అంకగణితాలను సులభంగా చేస్తాయంట.