కొబ్బరి పీచే అని బయట పడేస్తున్నారా..? ఇది తెలిస్తే నోరెళ్లబెడతారు
11 August 2025
Prudvi Battula
కొబ్బరి పీచును పడైకుండా ఉంచితే గిన్నెలు కడగడానికి ఉపయోగించవచ్చు. దింతో గిన్నెలు శుభ్రం చేస్తే జిడ్డు, మరకలు సులభంగా పోతాయి.
మీకు కుట్లు, అల్లికలు వస్తే ఇంట్లో కాలి సమయంలో కొబ్బరి పీచుతో ట్రెండీ డిజైన్లతో మీకు నచ్చిన తరహాలో డోర్ మ్యాట్ తయారు చేసుకోవచ్చు.
కొబ్బరి పీచుతో ఇంటిని, వస్తువులను క్లీన్ చేసేందుకు చిన్న బ్రష్ కూడా చేసుకోవచ్చు. దీనితో వస్తువులపై దుమ్మును ఈజీగా తుడుచుకోవచ్చు.
కొబ్బరి పీచుతో ఏవైనా వస్తువులు కట్టేందుకు తాళ్లు కుడి తయారు చేసుకోవచ్చు. దీనితో చేసిన చాలా బలంగా ఉంటాయి. అంత సులభంగా తెగవు.
కొబ్బరి పీచును పాన్‌లో మాడిపోయి పొడిగా మారేంత వరకు వేయించి అందులో నూనెతో కలిపి తలకు రాసుకుంటే మీ జుట్టు నల్లగా మారుతుంది.
మీ గార్డెనింగ్‌లో ఉపయోగించే కోకో పిట్‌ను కొబ్బరి పీచుతో తయారు చేసుకొంటే మొక్కలకు తేమను అందిస్తుంది. దీనివల్ల మొక్కలు ఎండిపోవు.
కొబ్బరి పీచును పొడి చేసి మొక్కల దగ్గర చల్లటం వల్ల నెల సారవంతంగా మారి ఇవి ఆరోగ్యంగా ఎదగటానికి సహాయపడతాయి.
కొబ్బరి పీచుతో మీరు హాయిగా నిద్రపోవడానికి దిండ్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి మృదుత్వాన్ని కలిగిస్తాయి. దీంతో మంచి నిద్ర వస్తుంది.
కొబ్బరి పీచుతో మీ పెంపుడు జంతువుల కోసం బెడ్ కూడా చేసుకోవచ్చు. పెట్ బెడ్ కోసం కొబ్బరి పీచు ఉపయోగించడం వల్ల అవి కంఫర్ట్ ఫీల్ అవుతాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
పోద్ది.. అలా చేస్తే మొత్తం పోద్ది.. మారిన ట్యాక్స్ రూల్స్!
వర్షాకాలంలో ఈ ఫుడ్స్ తింటే.. మీ ఆరోగ్యం అస్సలు తగ్గేదేలే..
స్త్రీ శరీరంపై ఆ ప్రదేశాల్లో బల్లి పడితే.. శుభమా.? అరిష్టమా.?