మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలా మంది అతిగా మద్యం సేవిస్తుంటారు. ఈ మధ్యకాలంలో మద్యం సేవించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.
యూత్ నుంచి పెద్ద వారి వరకు మద్యానికి బానిస అవుతున్నవారు చాలా మందే ఉన్నారు. అలాగే ఏచిన్న ఫంక్షన్ జరిగా కూడా ఆల్కహాల్ అనేది చాలా కామన్ అయిపోయింది.
కానీ తాజాగా నిర్వహించిన సర్వేలో మాత్రం ఓ షాకింగ్ విషయం వెళ్లడి అయ్యింది . ఇంతకీ అసలు విషయం ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
దేశంలో ధనికులు మూడింట ఒక వంత మద్యానికి దూరంగా ఉన్నారంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మెర్సెడెస్ బెంజ్ హురున్ ఇండియా లగ్జరీ కన్ జ్యూమర్ చేసిన ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి అయ్యాయి. అందులో కొంత మందిని తీసుకొని సర్వే చేశారు.
ముఖ్యంగా రూ.8.5 కోట్ల సంపద ఉన్న 150 మంది సర్వేలో పాల్గొనగా, అందులో 34 శాతం మంది అస్సలే మద్యం సేవించమని, 32 శాతం మంది మాత్రమే మద్యం సేవిస్తున్నట్లు తెలిపారంట.
అందులో ఎక్కువ మంది విస్కీకి ప్రాధాన్యం ఇవ్వగా, 11 శాతం మంది మాత్రం రెడ్ వైన్ అలాగే 9 శాతం మంది షాంపైన్ తాగేందుకు ఇష్టపడుతున్నట్లు తేలిందంట.
ఇక మరో విషయం ఏమిటంటే? ఇందులో ఎక్కువ శాతం యూపీఐ చెల్లింపులు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తేలిందంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.