లవంగాలతో బోలెడు లాభాలు.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
06 December 2024
TV9 Telugu
TV9 Telugu
లవంగం.. ప్రతి ఇంటి వంటగదిలో తప్పక ఉండే మసాలా దినుసుల్లో ఒకటి. దీని పేరు వినగానే ర్యానీ, మసాలా కూరలు... గుర్తొస్తాయి. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి
TV9 Telugu
లవంగాలు ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్, మధుమేహం, పంటినొప్పి వంటి సమస్యలు నయం అవుతాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది
TV9 Telugu
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండి ఫ్రీరాడికల్స్‌తో పోరాడి బరువుని తగ్గిస్తాయి. ఎలాజిక్ ఆమ్లాలు క్యాన్సర్ కణాలను వృద్ధి చెందకుండా కాపాడతాయి
TV9 Telugu
లవంగం నీరు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ నీటిని తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. లవంగం నీటిలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది
TV9 Telugu
లవంగం నీటిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. లవంగం నీరు జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది జుట్టును బలంగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది
TV9 Telugu
వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి కురులను త్వరగా పెరిగేలానే కాదు.. దృఢంగానూ చేస్తాయి. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలూ ఎక్కువే. జుట్టు పలచబడటం, చుండ్రు వంటి సమస్యలకు చెక్ పెట్టేస్తుంది
TV9 Telugu
దీనిలో ఉండే విటమిన్ కె మాడుపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా వెంట్రుకలు రాలకుండా సాయపడుతుంది. జుట్టు త్వరగా తెల్లబడకుండానూ నిరోధిస్తుంది
TV9 Telugu
లవంగం నీటిని తీసుకోవడం చర్మానికి మేలు చేస్తుంది. ఇది కొల్లాజెన్ మూలకాలను సృష్టిస్తుంది. లవంగం నీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది