ఇవి డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ తింటే శరీరంలో ఇన్సులిన్‌ను ఎక్కువగా పెరగనివ్వదు.
మొలకెత్తిన మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉన్నందున సులభంగా జీర్ఱం అవుతాయి. ఇవి మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి నుంచి ఉపశమనం లబిస్తుంది. జీర్ణాశయంలో ఎంజైమ్‌లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.
మొలకెత్తిన మెంతుల్లో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉన్నందున కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు.
ఇది బరువు తగ్గేందుకు తగ్గేందుకు ప్రణాళిక చూసుకొన్నవారికి మంచి ఎంపిక. మొలకెత్తిన మెంతులు రోజూ తింటే త్వరగా బరువు తగ్గుతారు.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి.
మొలకెత్తిన మెంతుల రోజూ తింటే శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గి గుండె పోటు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.