33 మందితో అతి చిన్న దేశం.. సొంత ప్రభుత్వం.. కరెన్సీ కూడా..
16 September 2025
Prudvi Battula
మోలోసియా యునైటెడ్ స్టేట్స్‌లోని నెవాడాలోని డేటన్ సమీపంలో ఉంది. ఇది 11.3 ఎకరాల భూమిని కలిగి ఉన్న గుర్తింపు లేని దేశం.
ఈ మైక్రోనేషన్‌లో అధ్యక్షుడి కుటుంబం, మరికొందరు, నాలుగు కుక్కలతో సహా దాదాపు 30-33 మంది జనాభా ఉన్నారు.
మోలోసియాను 1977లో కెవిన్ బాగ్ స్థాపించారు. అప్పటి నుండి దానిని సొంత ప్రభుత్వం, చట్టాలు, సంప్రదాయాలతో పూర్తి స్థాయి మైక్రోనేషన్‌గా అభివృద్ధి చేశాడు.
మొలోసియాకి కెవిన్ బాగ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అలాగే ప్రజలకు పోస్ట్ ఆఫీస్, లైబ్రరీ, స్మశానవాటిక వంటి సౌకర్యాలు కల్పించారు.
మొలోసియాకు సొంత కరెన్సీ వలోరా ఉంది. ఇది 100 ఫుట్రస్‌లుగా విభజించబడింది. ఒక వలోరాకు 0.80 USD మార్పిడి రేటును కలిగి ఉంది.
మొలోసియాలో ఉల్లిపాయలు, వాల్రస్‌లు, క్యాట్‌ఫిష్‌లపై నిషేధం. అణు పరికరాలను పేల్చితే 500 వలోరా జరిమాన. బాత్రూమ్‌లలో పెర్కషన్ వాయిద్యాలను వాయించడం నిషేధం.
పర్యాటకులు మొలోసియాను సందర్శించడానికి అనుమతి ఉంది. కానీ ఒకేసారి రెండు గంటలు మాత్రమే. వారికి స్టాంప్ వేసిన పాస్‌పోర్ట్ ఇచ్చి గైడెడ్ టూర్ అందిస్తున్నారు.
తూర్పు జర్మనీ 1990లో ఉనికిలో లేనప్పటికీ, మొలోసియా దానితో యుద్ధం చేసి దేశాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
ఈ దేశం గురించి వాదనలు ఉన్నప్పటికీ, ఐక్యరాజ్యసమితితో సహా ఏ దేశం కూడా మొలోసియాను సార్వభౌమ దేశంగా గుర్తించలేదు.