ఎవరికీ తెలియని నిజం.. పాము తోకలో కూడా విషం ఉంటుందా?

Samatha

29 september 2026

Pic credit - Pinterest

పాముల గురించి చెప్పాల్సిన పనిలేదు. దేశంలో అనేక రకాల పాములు ఉన్నాయి. ఒక్కో పాము ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది.

పాములు

ఇక పాములు అంటే ప్రతి ఒక్కరికీ భయం ఉంటుంది. చాలా మంది వీటిని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు.

భయం

ఎందుకంటే, పాముకాటు చాలా ప్రమాదకరం, దీని వలన చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది.

పాము కాటు

అందుకే పాములను చూస్తే వణుకుతుంటారు. కొంత మంది అయితే పాము తోక కాలికి తగిలినా సరే విషం శరీరంలోకి వెళ్తుందని భయపడుతారు.

పాము తోక

ఎందుకంటే చాలా మంది పాము తోకలో కూడా విషం ఉంది అనుకుంటారు. మరి నిజంగా పాము తోకలో విషం ఉందా? అసలు దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

పాము తోకలో విషం

నిపుణుల ప్రకారం, పాము తోకకు ఎలాంటి విషం ఉండదు, అది కేవలం దానికి రక్షణ యంత్రాంగంగా మాత్రమే పని చేస్తుందంట.

విషం ఉండదు

పాముకు ప్రమాదం వాటిల్లినప్పుడు మాత్రమే అది తన తోకను ఆడించి భయపెట్టడానికి ప్రయత్నిస్తుందంట. అంతే తప్ప పాము తోకతో ప్రమాదం ఉండదంట.

రక్షణ కవచం

అంతే తప్ప పాము తోకతో కొట్టినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దానిలో విషం ఉండదు అని చెబుతున్నారు నిపుణులు.

భయం అవసరం లేదు