మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకుని నిద్రపోతే.. అంతే సంగతులు!

31 August 2025

Prudvi Battula 

ఈ రోజుల్లో చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. నిద్రపోయే ముందు రాత్రి ఆలస్యంగా మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు.

కొంతమంది ఉదయాన్నే నిద్ర లేవడం కోసం ఓ టైంకి అలారం పెట్టుకోవడానికి తమ మొబైల్‌ను దిండు దగ్గర ఉంచుకుంటారు.

అదే సమయంలో, మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకుని నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు, వైద్యులు.

మీరు వాడే మొబైల్ స్క్రీన్ నుండి వెలువడే నీలి కాంతి మీ నిద్రకు భంగం కలిగిస్తుందంటున్నారు ఎక్స్‌ఫర్ట్స్.

ఈ కాంతి మెదడులోని మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్‌ను తగ్గిస్తుంది. ఇది మీకు మంచి నిద్ర రాకుండా నిరోధిస్తుంది. దీని వలన అలసట, చిరాకు, ఒత్తిడి పెరుగుతుంది.

మీ మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకుని నిద్రపోవడం వల్ల దాని నుండి వెలువడే ఎలక్ట్రానిక్ రేడియేషన్ శరీరానికి హాని కలిగిస్తుంది.

ఈ రేడియేషన్ మెదడు, గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మొబైల్ ఫోన్ దగ్గరగా ఉంచుకోవడం వల్ల తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్య పెరుగుతుంది.

మీ మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకుని నిద్రపోవడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ లేదా క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.