నోరు తెరిచి నిద్రపోతున్నారా.? ఆ సమస్యలు పోస్ట్‎లో వచ్చినట్టే.. 

06 August 2025

Prudvi Battula 

నోట్లో లాలాజలం ఆమ్లాలు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించి దంతాలు, చిగుళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది.

మీరు రాత్రంతా నోరు తెరిచి నిద్రపోయినప్పుడు, లాలాజలం మొత్తం ఆవిరైపోతుంది. ఇది పొడిబారడానికి కారణం అవుతుంది.

నోట్లో లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది చిగుళ్ల వాపు, కావిటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

నోరు పొడిబారడం వల్ల నోటిలో కాండిడా, ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల కారణం అవుతుంది. ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది.

నోట్లో లాలాజలం తగ్గడం వల్ల దంతాలపై ఎనామిల్ తగ్గుముఖం పడుతుంది. దీంతో పళ్లలో సున్నితత్వం పెరిగి ఊడిపోయే ప్రమాదం ఉంది.

నోటితో గాలి పీల్చడం వల్ల నోరు పొడిబారి గొంతు చికాకు కలిగిస్తుంది. దీనివల్ల నొప్పి, బొంగురు గొంతు వస్తుంది.

నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత సరిగా లేకపోవడం, పగటిపూట అలసట, దృష్టి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల తలనొప్పి కూడా వస్తుంది. అలాగే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.