ప్రతిరోజూ అన్నం తింటున్నారా.? ఆ సమస్యలను పాకెట్‎లో పెట్టుకున్నట్టే..

08 August 2025

Prudvi Battula 

రోజుకి ఎక్కువసార్లు అన్నం తినడం వల్ల శరీరానికి ఉపయోగాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు ఉన్నవారు దీనిపై శ్రద్ధ వహించాలి.

వరి నేలలో ఆర్సెనిక్ ఉంటుంది. దీనికి దీర్ఘకాలికంగా గురికావడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందంటున్నారు వైద్య నిపుణులు.

ప్రతిరోజు అన్నం ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం సమస్యలు, ఉబ్బరం మొదలైన కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.

ఇందులో ఫైబర్, ప్రోటీన్ లేకపోవడం వల్ల కండరాలు బలహీనపడటం, శరీరానికి అలసట కలుగుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

అన్నం రోజూ తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుందంటున్నారు.

ప్రమాదాలను తగ్గించడానికి, మీ ఆహారాన్ని వైవిధ్యపరచండి. అన్నం తినడం తగ్గించి ఎక్కువగా తృణధాన్యాలు ఎంచుకోండి.

ఈ వార్త సమాచారం కోసం మాత్రమే.. ఆహారపట్ల మార్పులు తీసుకురావాలనుకుంటే ముందుగా వైద్యుల సూచన తీసుకోవాలి.