జ్వరం ఉన్నప్పుడు చికెన్ తినకూడదా.? నిజం ఏంటి.?

06 August 2025

Prudvi Battula 

జ్వరం వచ్చిన కూడా మీకు చికెన్ తినాలి అనిపిస్తే ఎలాంటి డౌట్ లేకుండా చికెన్ తినవచ్చు అంటున్నారు నిపుణులు.

జ్వరం ఉన్నప్పుడు చికెన్ తింటే.. మీ రోగ నిరోధక శక్తి బలపడి ఫీవర్ త్వరగా తగ్గుతుందని నివేదికలు చెబుతున్నాయి.

చికెన్‌లో ఎన్నో రకాల పోషకలు ఉంటాయి. ఇవి జ్వరం ద్వారా వచ్చే నీరసాన్ని, అలసటను దూరం చేస్తాయి. మళ్లీ ఎనర్టిటిక్‌గా అయ్యేలా చేస్తాయి.

కొంత మందికి జ్వరం ఉన్నప్పుడు స్పైసీగా ఉండే ఆహారాలు తినాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు చికెన్ బిర్యానీ లేదా చికెన్ ఐటెమ్స్ హ్యాపీగా తినవచ్చు.

జ్వరం ఉన్నప్పుడు చికెన్ తినమన్నారని కదా అని ఎలా పడితే అలా తింటే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు.

ఇంట్లో చేసిన చికెన్ మాత్రమే తినాలి. ఎందుకంటే బయట ఎలా వండుతారో, ఇంకా వాటిల్లో ఏం కలుపుతారో తెలీదు. కాబట్టి.. చికెన్‌ని కాస్త ప్రత్యేకంగా తినాలి.

కారాలు, మసాలాలు తగ్గించాలి. చికెన్‌ని బాగా ఉడికించి తినాలి. వేపుళ్లు వంటివి తినకూడదు. ఉడికించి వేపుడు తీసుకున్నా మంచిదే.

చికెన్‌ని మాత్రం బాగా ఉడికించిన తర్వాతే తినాలి. అలా తింటే త్వరగా జీర్ణం అవుతుంది. ఎలాంటి సమస్యలు రావు.