సైంధవ లవణం వాడితే గుండె వేగం తగ్గుతుందా?
19 September 2026
TV9 Telugu
TV9 Telugu
ఇటీవల ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలామంది సాధారణ తెల్ల ఉప్పుకు బదులుగా సైంధవ లవణం (సెందా నమక్) వాడుతున్నారు
TV9 Telugu
ఇది గుండె ఆరోగ్యానికి, రక్తపోటుకు, విశ్రాంతి సమయంలో గుండె కొట్టుకునే వేగానికి మంచిదనే భావన చాలామందిలో ఉంది
TV9 Telugu
అయితే తెల్ల ఉప్పు స్థానంలో సైంధవ లవణాన్ని ఉపయోగించడం వల్ల గుండె వేగం తప్పనిసరిగా తగ్గుతుందా అనే విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారంటే
TV9 Telugu
సహజసిద్ధ రూపంలో సైంధవ లవణంలో పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు స్వల్పంగా ఉంటాయి
TV9 Telugu
అయితే ఈ ఖనిజాల పరిమాణం చాలా తక్కువగా ఉండడంతో వాటిని చికిత్సా ప్రయోజనాలకు సరిపడే స్థాయిలో ఉన్నాయని చెప్పలేం
TV9 Telugu
ఉప్పు ఏ రకమైనదైనా శరీరం దానిలోని సోడియంనే ప్రధానంగా పరిగణిస్తుంది. సోడియం అధికంగా తీసుకున్నప్పుడు శరీరంలో అదనపు నీరు నిల్వ అవుతుంది
TV9 Telugu
దీంతో రక్త పరిమాణం పెరిగి రక్తనాళాలపై ఒత్తిడి అధికమవుతుంది. దీర్ఘకాలంలో ఇది అధిక రక్తపోటుకు, గుండెపై అదనపు భారానికి కారణమవుతుంది
TV9 Telugu
అందువల్ల తెల్ల ఉప్పు నుంచి సైంధవ లవణానికి మారినంత మాత్రాన గుండె వేగం తగ్గదు. రోజువారీగా తీసుకునే మొత్తం సోడియం పరిమాణం తగ్గితేనే ప్రయోజనం
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి