వయసుకు గాలెం వేసి అందాన్ని అందలం ఎక్కించే.. సుగంధ రారాజు!
06 October 2025
TV9 Telugu
TV9 Telugu
సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా పిలుచుకునే నల్ల మిరియాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల మిరియాలను సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు. అయితే, దీనికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి
TV9 Telugu
పాలల్లో కాసిని మిరియాలు వేసి కాస్త వేడివేడిగా తాగితే జలుబు పరార్! మిరియాల చారు రుచినే కాదు.. రోగనిరోధక శక్తినీ అందిస్తుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్-ఎ, సి పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఇవే మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. నాలుగు మిరియాలని కచ్చాపచ్చాగా దంచి తేనెతో కలిపి తమలపాకులో పెట్టి పుచ్చుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది
TV9 Telugu
15 మిరియపు గింజలు, రెండు లవంగాలు, ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని వాటిని దంచి వేణ్నీళ్లలో కాచి కొంచెం కొంచెంగా పుచ్చుకుంటే ఆయాసం, గొంతునొప్పి తగ్గుతాయి. జీవక్రియను పెంచుతాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి
TV9 Telugu
మిరియాలు కాలేయాన్ని శుద్ధిచేసి దాని పనితీరును మెరుగుపరుస్తాయి. ఫ్యాటీలివర్‌ని అదుపులో ఉంచుతాయి. నల్ల మిరియాలలో శరీరాన్ని రక్షించే అనేక యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి
TV9 Telugu
నల్ల మిరియాలు జీర్ణక్రియను పెంచుతాయి. జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పెంచుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది
TV9 Telugu
దీనిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దగ్గు, జలుబుతోపాటు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. మిరియాలకు తేనెతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి
TV9 Telugu
నల్ల మిరియాల్లో పైపెరిన్ ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేసే, కేలరీలను బర్న్ చేసి కొవ్వును కరిగించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడే థర్మోజెనిక్ సమ్మేళనం. ఈ పైపెరిన్ శరీరానికి ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. దీంతో వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది