రిపబ్లిక్ డేకి జాతీయ జెండా ఎగురవేస్తున్నారా? ఈ నియమాల గురించి తెలుసుకోండి

samatha.j

23 January 2025

Credit: Instagram

 రిపబ్లిక్ డే వచ్చేస్తుంది. దీంతో చాలా మంది ఇప్పటి నుంచి జెండా ఎగరవేయడానికి ఏర్పట్లు ప్రారంభిస్తారు.

అయితే, జాతీయ జెండా ఎగరవేసే క్రమంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. దానికి సంబంధించి కేంద్రప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది.

జాతీయ జెండా తప్పకుండా చేనేత ఖాది లేదా కాటన్ గుడ్డతో తయారు చేసినదై ఉండాలి. జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి.

.ప్లాస్టిక్ జెండాలు అసలే వాడరాదు.పై నుండి కిందకు 3 రంగులు సమానంగా ఉండాలి.జెండాను నేలమీదగాని, నీటి మీద పడనీయరాదు.

జెండాపై ఎలాంటి రాతలు, సంతకాలు, ప్రింటింగులు ఉండరాదు.జెండా ఎప్పుడూ నిటారుగా ఉండాలి. కిందికి వంచకూడదు.

 జెండాను  వేగంగా ఎగరవేయాలి, ఉదయాన్నే జాతీయ జెండను  ఎగురవేయాలి.జెండా మధ్యలోని దర్మచక్రంలో 24 ఆకులుండాలి. 

జెండా పాతబడితే తుడుపు గుడ్డగా మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉపయోగించరాదు. అది నేరం..దానిని కాల్చివేయాలి.ఎక్కడంటే అక్కడ పడ వేయరాదు.

జెండాను ఎగుర వేయునపుడు జాతీయనాయకుల ఫోటోలు ఉంచాలి. జెండాను ముందుగా 1,2 సార్లు పరిశీలించుకోవాలి. ఎక్కించి దించడం, మరల ఎక్కించడం చేయరాదు.