టమాట..! ఈ పేరు వినని తెలుగు వారు ఉండరు. ప్రతి ఇంట్లో ఈ కూరగాయ లేకుండా వంట పూర్తి కాదు. పప్పు, ఉప్మా, కిచిడీ, కూర.. ఎందులో చూసినా టొమాటోలేనని దర్శనమిస్తాయి
TV9 Telugu
అయితే కొందరు చారులోంచి కరివేపాకుని వేరుచేసినట్టు టొమాటో ముక్కల్ని తీసి పడేస్తుంటారు. దీన్లో పోషకాల గురించి తెలిస్తే ఇకపై అలా చేయలేరు
TV9 Telugu
టొమాటోలో ఫోలేట్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ కె వంటి సూక్ష్మ పోషకాలు అధికం. దీన్లో యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలం. ఇవి గుండెకు, మెదడుకు మేలు చేస్తాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడి క్యాన్సర్ ముప్పుని తగ్గిస్తాయి
TV9 Telugu
టమాటా టైప్-2 డయాబీటిస్ ప్రమాదాన్ని నివారిస్తుంది. వీటిలోని పోషకాలు రక్తపోటునీ తగ్గిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్లోని లైకోపీన్ కెరోటినాయిడ్ పిగ్మెంట్... ఆల్జీమర్స్ బారిన పడకుండా కాపాడుతుంది
TV9 Telugu
ల్యూటేన్, జియాంజాంతిన్ డిజిటల్ పరికరాల నుంచి వెలువడే నీలికాంతి నుంచి కళ్లను రక్షిస్తాయి. వీటిలోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది
TV9 Telugu
ఒక కప్పు టమాటా రసంలో 45 మి.గ్రా. విటమిన్ సి ఉంటుందట. ఇది రోజులో అవసరమయ్యే దాన్లో 75 శాతానికి సమానం. దీనివల్ల రోగనిరోధక శక్తి భలేగా పెరుగుతుంది
TV9 Telugu
అందుకే కూరగాయల్లో కలిపి వండుతారో, కూర, పచ్చడి చేస్తారో ఛాయిస్ మీదే.. ఎలా వండినా సరే టమాటాని రోజూ ఇంట్లోవాళ్ల ఒంట్లోకి పంపడం మీ బాధ్యతే
TV9 Telugu
ప్రస్తుతం మార్కెట్లో టమాటా రేట్లు మండిపోతున్నాయి. టమాటాలేని వంటలను మనోళ్లు ఊహించలేరు. అందుకే ఎంత ధరైనా సరే కనీసం అయినా కూరలో ఒక్క టమాటా అయినా వేయాల్సిందే